Priyanka Jain Breakup : ప్రియుడు చెప్పిన బ్రేకప్ పై ప్రియాంక జైన్ సీరియస్.. సోషల్ మీడియాలో వైరల్!
on Apr 1, 2025
ప్రియాంక జైన్ బిగ్ బాస్ షో తో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైంది. ఇక ఆమె ప్రియుడు శివ్ కుమార్ తో కలిసి యూట్యూబ్ లో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తుంటారు. తాజాగా ఓ వ్లాగ్ చేసి ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ 2’ షోకి శివ్ కుమార్ వెళ్లాడు. అక్కడ ప్రియాంక జైన్‌కి బ్రేకప్ చెప్తున్నట్టుగా ప్రాంక్ కాల్ చేశారు. ఈ విషయాన్ని పెద్ద వాళ్ల దృష్టికి తీసుకుని వెళ్తానంటూ ప్రియాంక జైన్ సీరియస్ అయ్యింది. ప్రాంక్ చేయమంటే.. నీకు బ్రేకప్ అనే మాట ఎలా వచ్చిందని ప్రియాంక జైన్ సీరియస్ అయిపోయింది. ఇది ప్రాంక్ అని ఎవరు చెప్పారు.. నేను సీరియస్‌గా చెప్తున్నానని అన్నాడు శివ్ కుమార్. నువ్వు సీరియస్‌గా చెప్పడం కాదు.. నేను సీరియస్‌గానే చెప్తున్నా.. ఇప్పుడు నేను నీకు నిజంగానే బ్రేకప్ చెప్తున్నా.. ఆల్ ది బెస్ట్ నీ బతుకు నువ్వు బతుకు అని శివ్ కుమార్‌కి ట్విస్ట్ ఇచ్చింది ప్రియాంక జైన్. అయితే వీళ్ల బ్రేకప్‌తో ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ 2’ ప్రోమో ట్రెండింగ్ లోకి వెళ్ళింది. ప్రియాంక జైన్, శివ్ కుమార్‌ల బ్రేకప్ న్యూస్ నెట్టింట వైరల్ అయ్యింది.
శివ్ కుమార్ ఆ వ్లాగ్ లో అసలేం జరిగిందో చెప్పాడు. నేను షూటింగ్‌కి వచ్చేసరికి రాత్రి 1 అయ్యింది. అప్పటికి ప్రియాంక గారు ఇంట్లో లేరు. మీ అందరికీ తెలుసు.. తనకి బ్రేకప్ చెప్తున్నట్టుగా ప్రాంక్ చేశారు. అది ప్రోమో కూడా వచ్చింది. స్టేజ్‌పై నుంచే ప్రియాంక గారికి ఫోన్ చేసి ప్రాంక్ చేయాలని అన్నప్పుడు.. వాళ్లు చెప్పినట్టే నేను ప్రాంక్ చేశాను. కానీ ప్రియాంక గారు దాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ తీయడం లేదు. ఇప్పుడు ఆమెను కలిసి.. ఆమెతో మాట్లాడకపోతే.. నాకు నిద్ర పట్టదు. చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను. ప్రోమోలో ఆమె చాలా సీరియస్ అయ్యారు. చూసే వాళ్లు కూడా నన్ను తిట్టుకోవద్దు. అది జస్ట్ ప్రాంక్‌లో భాగంగానే చేశాను. నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను.. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆమె షూట్ నుంచి వచ్చిన తరువాత.. ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని శివ్ చెప్పాడు.
ప్రియాంక ఇంటికొచ్చాక శివ్ మీద చాలా సీరియస్ అయ్యింది. నువ్వు నన్ను ముట్టుకోకు శివ్.. చిరాకు వస్తుందని ప్రియాంక అంది. అరే.. ఎందుకిలా చేస్తున్నావని ఆమె వెనుకే వెళ్లాడు శివ్. దాంతో ప్రియాంక.. ఇది కూడా ప్రాంక్ అంటూ పెద్దగా నవ్వేసింది. నువ్వు నాపై ప్రాంక్ చేశావ్ కాబట్టి నేను కూడా ప్రాంక్ చేశాను. ప్రాంక్ చేస్తే నాకు ఎలా అనిపించిందో నీకు అనిపించాలనే ఇలా చేశాను.. ఇదంతా కాదు కానీ.. బ్రేకప్ అని ఎందుకు చెప్పావ్.. నాకు ఎంత మండిందో తెలుసా అని ప్రియాంక అంది. వాళ్లు చేయమన్నారు పరీ.. సారీ అంటూ ప్రియాంకకు సారీ చెప్పేసి దగ్గరకు తీసుకున్నాడు శివ్. ఇక ఈ వ్లాగ్ చివరల్లో ఓ సలహా ఇచ్చారు. కామెడీకి కూడా మీ లవర్స్‌కి బ్రేకప్ చెప్పొద్దు.. దానికి చాలా దారుణంగా పనిష్మెంట్ ఉంటుంది. ఉదయం నుంచి ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకెంత భయం వేసిందో తెలుసా.. దయచేసి ఎవరూ ఇలా చేయొద్దంటూ శివ్, ప్రియాంక జైన్ చెప్పుకొచ్చారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
